స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు సుప్రీం హీరో సర్‌ప్రైజ్‌

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి మెగా గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. సాయ్‌ ధరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో తన బెస్ట్‌ ఫ్రెండ్‌ తమన్‌కు పాపులర్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్  'పెర్ల్ మాలెట్‌స్టేషన్‌' ను గిఫ్ట్ గా అందించాడు. తమన్‌ స్వయంగా దీని ట్విటర్ ద్వారా వెల్లడించారు.










 ''నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ లవ్లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి. ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నాను'' అంటూ ట్వీట్‌ చేశారు.   దీంతోపాటు లవ్లీ గిఫ్ట్‌ ఫొటోను కూడా షేర్‌ చేశారు.  దీంతో వరుస హిట్లతో దూసుకుపోతున్న తమన్‌  మెగా హీరో అందించిన ఊహించని కానుకతో  తెగ హ్యాపీగా ఫీలవుతున్నాడు.